Total Pageviews

Saturday, November 27, 2010

కుచ్‌ కట్టా మీటా నోరూరించే ఛాట్‌లు

కుచ్‌ కట్టా మీటా నోరూరించే ఛాట్‌లు
నోరూరించే ఛాట్‌ను ఇష్టపడని వారుండరు. గప్‌చుప్‌, కట్లెట్‌ వంటి వివిధ రకాల రుచికరమైన ఛాట్‌ ఐటమ్స్‌ను పిల్లలతో పాటు పెద్దవారు ఎంతో ఇష్టంగా తింటారు. ఆదివారాలు, ఇతర సెలవుదినాల్లో కుటుంబ సమేతంగా బయటకు వెళ్లే వారు సినిమాలు, షికార్లు చేస్తూ ఛాట్‌ రుచులను ఆస్వాదిస్తుంటారు.వీటిలో ముఖ్యంగా గప్‌చుప్‌లను ఎక్కువగా తింటారు.

ettinfmanహైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఛాట్‌ వెరెైటీలను అందించే పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ప్రత్యేకంగా వెలిశాయి. ఇవి ఉదయం నుంచి రాత్రి వరకు ఎల్లప్పుడు రద్దీతో కిటకిటలాడుతుంటాయి. హైదరాబాద్‌ నగరంలో తెలుగువారితో పాటు ఉత్తరాదీ వారు అధికంగా నివసిస్తున్నారు. గుజరాత్‌, రాజస్తాన్‌, మహరాష్ట్ర, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసిస్తున్న హైదరాబాద్‌ను మినీ ఇండియాగా పేర్కొంటారు. ఇక ఉత్తరాది వారి ఆహారపు అలవాట్లలో భాగంగా కనిపించే ఛాట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ ఎన్నో ప్రత్యేక రుచులలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

నోరూరించే రుచులతో...
chatహైదరాబాద్‌ నగరంలో ప్రతి రహదారిలో కనిపిస్తాయి వివిధ రకాల ఛాట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌. వీటిలో గప్‌చుప్‌, కట్లెట్‌, పావ్‌బాజీ, దహీపురీ, కచోరీ, సమోసా, దహీవడ, చుడువా వంటి ఎన్నో రకాల ఛాట్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకి ముఖ్యమైనది గప్‌చుప్‌. దీనినే పానీపూరీ లేదా గోల్‌ గప్పా అని కూడా అంటారు. ఇక పానీపూరీలను బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌లలో పూచ్‌కా అని కూడా పిలుస్తారు.గప్‌చుప్‌లు నేడు మన దేశంలోనే కాదు కొన్ని విదేశాల్లో సైతం ప్రఖ్యాతి గాంచాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో గప్‌చుప్‌లు లభిస్తాయనడం శోచనీయం కాదు. సై్పసీగా ఉండే నీటితో నింపి ఇచ్చే గప్‌చుప్‌లను పిల్లలతో పాటు పెద్దవారు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఉన్న పబ్బులు ప్రత్యేకంగా వోడ్కా గప్‌చుప్‌లను కూడా అందిస్తున్నాయి. పూర్తిగా వోడ్కాతో నింపి ఇచ్చే ఈ గప్‌చుప్‌లను యువతులు ఇష్టపడి తింటున్నారట.

ఉత్తరప్రదేశ్‌ నుంచి...
గప్‌చుప్‌ల తయారీ మొదట ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. అనంతరం ఈ పానీపూరీలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రధాన నగరాల్లోని స్కూల్‌, కాలేజీలకు వెళ్లే పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఇష్టంగా వీటిని తింటున్నారు. హైదరాబాద్‌లో గప్‌చుప్‌ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రజల ఇష్టం మేరకు నేడు ఎన్నో రకాల గప్‌చుప్‌లు లభ్యమవుతున్నాయి. వీటిలో స్వీట్‌, కట్టా,మీటా తదితర రకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. గప్‌చుప్‌లో నింపే సై్పసీగా ఉండే నీటిని చింతపండు, ఆలుగడ్డ, బఠాని, ఉల్లిపాయలు, ఛాట్‌మసాలను మంచినీటిలో కలిపి తయారుచేస్తున్నారు.

స్వీట్‌ గప్‌చుప్‌ల కోసం మంచినీటిలో కొంచెం బెల్లం, చక్కెరను కూడా కలుపుతున్నట్టు అబిడ్స్‌లోని ఓ ఛాట్‌ సెంటర్‌ నిర్వాహకుడు జగదీష్‌ తెలిపారు. ప్రజల అభిరుచుల మేరకు గప్‌చుప్‌లను వివిధ రకాలుగా తయారుచేస్తున్నామన్నారు. స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు పెద్దవాళ్లు సైతం ఎంతో ఇష్టంగా గప్‌చుప్‌లను తింటున్నారని చెప్పారు. పానీపూరీలను ఒక్కసారిగా నోట్లో వేసుకొని తింటే ఆ టేస్టే అమోఘం అని అన్నారు గప్‌చుప్‌ ప్రియుడు సుధాకర్‌. కనీసం వారానికి రెండు రోజుల పాటైనా గప్‌చుప్‌లను తాను తింటానని ఆయన చెప్పారు.

ఎన్నో వెరెైటీలు...
Sharmaf-Chudwaఛాట్‌లలో నేడు ఎన్నో వెరెైటీలు లభ్యమవుతున్నాయి. వీటిలో కట్లెట్‌, దహీపురీ, సేవ్‌పురీ, పావ్‌బాజీ, దహీవడ తదితరాలను భోజనప్రియులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. స్వీట్‌ లేదా హాట్‌గా ఈ ఛాట్‌లు లభిస్తున్నాయి. నేడు ఛాట్‌ సెంటర్ల వ్యాపారం హైదరాబాద్‌ నగరంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.

పావ్‌ బ్రెడ్‌తో లభించే పావ్‌బాజీ కొందరు స్కూల్‌, కాలేజీ స్టూటెండ్‌లకు ఇష్టమైన సై్ససీ ఫుడ్‌గా ఉంటోందని హిమాయత్‌నగర్‌లోని ఓ ఛాట్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఘన్‌శ్యామ్‌ తెలిపారు. తమ వద్ద ఇతర ఛాట్‌ ఐటమ్స్‌ కంటే పావ్‌బాజీ ఎక్కువగా అమ్ముడవుతుందని తెలిపారు. ఇక ప్రజలు అమితంగా ఇష్టపడి తినే ఛాట్‌లను ప్రత్యేకంగా వివాహాది శుభకారాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నారు. అన్ని రకాల రుచికరమైన భోజన పదార్థాలతో పాటు గప్‌చుప్‌, కట్లెట్‌ వంటి ఛాట్‌లను శుభకార్యాలకు వచ్చే వారు ఇష్టంగా ఆరగిస్తున్నారు.


దేశ,విదేశాల్లో ప్రఖ్యాతిగాంచి...
Sharma-Chudwa1సుల్తాన్‌బజార్‌ రాయల్‌ దిల్షాద్‌ ప్లాజా ఎదురుగా ఫుట్‌పాత్‌పెై ఎల్లప్పుడు రద్దీగా కనిపిస్తుంది ఓ చుడువా బండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కిటకిటలాడే ఈ చుడువా బండి గత 40 సంవత్సరాలుగా చుడువా ప్రియులకు సుపరిచతమే. ఇదే రమేష్‌చంద్‌ శర్మ ‘హరి ఓం చుడువా’ బండి.1968లో రమేష్‌చంద్‌ శర్మ దీన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ తోపుడు బండిలో లభించే చుడువా అందరినీ మైమరపిస్తోంది. ప్రస్తుతం రమేష్‌చంద్‌ తనయులు ముఖేష్‌ శర్మ, విశాల్‌శర్మ, గన్నూలు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చుడువాను ప్రత్యేకంగా ప్యాకింగ్‌లలో సైతం వారు విక్రయిస్తుంటారు.

‘తమ తండ్రి తయారుచేసిన సై్పసీగా ఉండే చుడువాను నాటి నుంచి నేటి వరకు రుచిలో ఎటువంటి మార్పు లేకుండా రూపొందిస్తున్నాము. ప్రజల టేస్ట్‌ మేరకు ప్రస్తుతం బాదం పిస్తా, డ్రైఫ్రూట్స్‌, స్వీట్‌, కట్టామీటా తదితర రకాల చుడువాలను తయారుచేస్తున్నాము’ అని ముఖేష్‌ శర్మ పేర్కొన్నారు. ఇక హరి ఓం చుడువాను హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యేకంగా కొనుగోలుచేస్తుంటారు. తమ స్వస్థలానికి వచ్చి విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా ఈ చుడువాను కొనుక్కొని వెంట తీసుకెళ్తుంటారు. ప్రత్యేకంగా వివాహాది శుభకార్యాలు, పార్టీలు, ఫంక్షన్‌లకు ఈ రుచికరమైన చుడువాను ప్రత్యేకంగా తీసుకుపోతారు.పలు ఛాట్‌ సెంటర్ల నిర్వాహకులు సైతం హరి ఓం చుడువాను తీసుకెళ్లి తమ షాపులలో ఏర్పాటుచేస్తుండడం విశేషం.

-ఎస్‌.అనిల్‌ కుమార్






No comments:

Post a Comment