Total Pageviews

Monday, November 29, 2010

Browse Inside Your Chinese Horoscope 2011: What The Year of the Rabbit Holds in Store: For You by Neil Somerville

Browse Inside Your Chinese Horoscope 2011: What The Year of the Rabbit Holds in Store: For You by Neil Somerville

"కరివేపాకు పొడి"లో ఐరన్ పుష్కళం...!

"కరివేపాకు పొడి"లో ఐరన్ పుష్కళం...!
Curry Leaves

కావలసిన పదార్థాలు :
కరివేపాకు... ఒక కప్పు
ఎండుమిర్చి... నాలుగు
జీలకర్ర... ఒక టీ.
ధనియాలు... రెండు టీ.
చింతపండు... సరిపడా
మినప్పప్పు... రెండు టీ.
శనగపప్పు... రెండు టీ.
వేరుశనగలు... నాలుగు టీ.
తురిమిన పచ్చి కొబ్బరి... 1/4 కప్పు
వెల్లుల్లి... ఐదు రెబ్బలు
నెయ్యి... రెండు టీ.
నూనె... ఒక టీ.
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి.

బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడికి కొబ్బరి పొడి కూడా కలిపి తడి ఆరిపోయి, పొడి పొడిగా అయ్యేదాకా వేయించి దింపేయాలి. అంతే కరివేపాకు పొడి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ శక్తిని కలిగివున్న కరివేపాకుతో తయారు చేసిన పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
వెబ్ దునియా వంటలు


యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"

యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"
Grapes
FILE
కావలసిన పదార్థాలు :
పుల్లటి ద్రాక్ష కాయలు.. ఒక కేజీ
ఆవాలపొడి.. 2 టీ.
కారం.. 4 టీ.
ఉప్పు.. 2 టీ.
జీలకర్ర పొడి.. 2 టీ.
వెల్లుల్లి రేకలు.. ఒక పాయ మొత్తం
నూనె.. తగినంత

తయారీ విధానం :
ద్రాక్ష కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత నిలువుగా రెండు ముక్కలుగా ద్రాక్షకాయలను కోసుకోవాలి. ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతోపాటు సరిపడా నూనె పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో వేసి మూతపెట్టి ఉంచాలి. మూడు రోజులు బాగా ఊరిన తరువాత, ఈ మిశ్రమంలో ఊట వచ్చి పుల్లగా ఉండే ద్రాక్ష ఆవకాయ తయారవుతుంది.

దీనిని కావల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పాత్రలోకి తీసుకుని అలాగే అయినా లేదా పోపు పెట్టుకుని అయినా అన్నం, ఇడ్లీ, చపాతీ లాంటి వాటిలో నంజుకుని తినవచ్చు. అంతే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పుల్లటి ద్రాక్ష ఆవకాయ తయార్..! శరీరాన్ని తాజాగా ఉంచి ఎల్లప్పుడూ యవ్వనవంతులుగా ఉంచే శక్తి ద్రాక్షలో మెండుగా ఉన్నాయి. అలాగే మతిమరపును దూరం చేయటమేగాక, కాలేయాన్ని కూడా ద్రాక్ష సంరక్షిస్తుంది. కాబట్టి ఈ వెరైటీ ఆవకాయను మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!
వెబ్ దునియా వంటలు


Sunday, November 28, 2010

పుల్ల మామిడితో "రవ్వ పులిహోర"

పుల్ల మామిడితో "రవ్వ పులిహోర"
Pulihora
FILE
కావలసిన పదార్థాలు :
పుల్లటి మామిడికాయ తురుము.. రెండు కప్పులు
బియ్యం రవ్వ.. నాలుగు కప్పులు
ఆవాలు.. రెండు టీ.
శెనగపప్పు, మినప్పప్పు.. రెండు టీ. చొప్పున
వేరుశెనగ పప్పు.. నాలుగు టీ.
జీడిపప్పులు.. 20
పచ్చిమిర్చి.. ఎనిమిది
ఎండుమిర్చి.. నాలుగు
ఇంగువ, పసుపు.. అర టీ.
కరివేపాకు.. నాలుగు రెబ్బలు
నూనె, ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. ఆపై దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను కలపాలి.

ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా చేర్చి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనుంచిన బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి. అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర తయార్..!! దీన్ని అలాగే వేడి వేడిగా తింటే అద్భుతంగా, వెరైటీగా ఉంటుంది.



పుదీనా రైస్

పుదీనా రైస్
కావలసిన పదార్థాలు:

పుదీనా - 2 కట్టలు, బాస్మతి బియ్యం - 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము - పావుకప్పు, పచ్చిమిర్చి - 3, ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌, లవంగాలు - 4, యాలకులు - 4, దాల్చిన చెక్క - 4, పలావు ఆకులు - 4, అనాసపువ్వు - ఒకటి, వేయించిన జీడిపప్పు - పావుకప్పు, నెయ్యి - 2 టీస్పూన్లు, ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా కడగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా.. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ మీద ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి అది మరిగాక మసాలా దినుసులు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక గ్రైండ్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్టును వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి.

ఈ విశ్రమం ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారిన తర్వాత నానబెట్టకున్న బియ్యం, నీళ్లతో సహా వేసి గరిటెతో బాగా కలపి ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్ ఉపయోగించినట్లయితే మూతపై బరువు పెట్టాల్సిన అవసరం లేదు. అదే మందపాటి పాత్రను ఉపయోగించినట్లయితే దాని మూత ఉంచుకోవాలి.

అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి. దీనికి సైడ్ డిష్‌గా గ్రేవీగా చేసుకున్న ఏదైనా మసాల కర్రీని కానీ.. లేదా పెరుగు చట్నీని కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు.




పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!

పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!
soup
FILE
కావలసిన పదార్థాలు :
పొట్టేలు లెగ్ పీసెస్.. నాలుగు
ఎసరు నీరు.. ఒకటిన్నర లీ.
వెన్న.. 50 గ్రా.
కార్న్‌ఫ్లోర్.. 25 గ్రా.
కొబ్బరిపాలు.. 2 కప్పులు
గసాల పాలు.. ఒక కప్పు
కొత్తిమీర తురుము.. అర కప్పు
జీడిపప్పు పేస్టు.. 25 గ్రా.
పుదీనా తురుము.. ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
ఉల్లిముద్ద.. ఒక టీ.
కారం.. అర టీ.
పచ్చిమిర్చి ముద్ద.. ఒక టీ.
గరంమసాలా పొడి.. అర టీ.
కుంకుమపువ్వు.. చిటికెడు
ఉప్పు.. తగినంత
నిమ్మరసం.. 2 టీ.

తయారీ విధానం :
లెగ్‌ పీసెస్‌ను కుక్కర్‌లో వేసి ఉల్లిముద్ద, అల్లంముద్ద, పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, కారం, ఉప్పు, మసాలా పొడి, సగం కొత్తిమీర, పుదీనా తురుము వేసి ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి 10 విజిల్స్‌ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించి ముక్కలు తీసేసి నీళ్లను విడిగా వడకట్టి ఉంచాలి. కార్న్‌ఫ్లోర్‌, జీడిపప్పు ముద్ద, గసాల పాలు, కొబ్బరిపాలు, కుంకుమపువ్వు అన్నీ కలిపి ఉంచాలి.

ఓ పాత్రలో మటన్‌ స్టాక్‌ (వడకట్టిన నీళ్ళు) పోసి మరిగించి, అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం జారుగా పోస్తూ కలపాలి. తరువాత ఉడికించిన కాళ్లు, సరిపడా ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించి, వెన్న వేసి దించాలి. చివరగా నిమ్మరసం కలిపి సూప్‌ను చిన్నచిన్న బౌల్స్‌లోకి సర్ది.. ఒక్కో బౌల్‌లో, ఒక్కో మటన్‌ పీస్‌ను కూడా ఉంచి కొత్తిమీర చల్లితే నోరూరించే మటన్‌ సూప్‌ రెడీ..! పోషకాహార లోపంతో బాధపడేవారికి ఇది ఎంతో బలాన్నిస్తుంది.

Health Issues | Homeo medicines | Urine problems | పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి

పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి