Total Pageviews

Sunday, November 28, 2010

పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!

పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!
soup
FILE
కావలసిన పదార్థాలు :
పొట్టేలు లెగ్ పీసెస్.. నాలుగు
ఎసరు నీరు.. ఒకటిన్నర లీ.
వెన్న.. 50 గ్రా.
కార్న్‌ఫ్లోర్.. 25 గ్రా.
కొబ్బరిపాలు.. 2 కప్పులు
గసాల పాలు.. ఒక కప్పు
కొత్తిమీర తురుము.. అర కప్పు
జీడిపప్పు పేస్టు.. 25 గ్రా.
పుదీనా తురుము.. ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
ఉల్లిముద్ద.. ఒక టీ.
కారం.. అర టీ.
పచ్చిమిర్చి ముద్ద.. ఒక టీ.
గరంమసాలా పొడి.. అర టీ.
కుంకుమపువ్వు.. చిటికెడు
ఉప్పు.. తగినంత
నిమ్మరసం.. 2 టీ.

తయారీ విధానం :
లెగ్‌ పీసెస్‌ను కుక్కర్‌లో వేసి ఉల్లిముద్ద, అల్లంముద్ద, పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, కారం, ఉప్పు, మసాలా పొడి, సగం కొత్తిమీర, పుదీనా తురుము వేసి ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి 10 విజిల్స్‌ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించి ముక్కలు తీసేసి నీళ్లను విడిగా వడకట్టి ఉంచాలి. కార్న్‌ఫ్లోర్‌, జీడిపప్పు ముద్ద, గసాల పాలు, కొబ్బరిపాలు, కుంకుమపువ్వు అన్నీ కలిపి ఉంచాలి.

ఓ పాత్రలో మటన్‌ స్టాక్‌ (వడకట్టిన నీళ్ళు) పోసి మరిగించి, అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం జారుగా పోస్తూ కలపాలి. తరువాత ఉడికించిన కాళ్లు, సరిపడా ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించి, వెన్న వేసి దించాలి. చివరగా నిమ్మరసం కలిపి సూప్‌ను చిన్నచిన్న బౌల్స్‌లోకి సర్ది.. ఒక్కో బౌల్‌లో, ఒక్కో మటన్‌ పీస్‌ను కూడా ఉంచి కొత్తిమీర చల్లితే నోరూరించే మటన్‌ సూప్‌ రెడీ..! పోషకాహార లోపంతో బాధపడేవారికి ఇది ఎంతో బలాన్నిస్తుంది.

No comments:

Post a Comment