Total Pageviews

Monday, November 29, 2010

Browse Inside Your Chinese Horoscope 2011: What The Year of the Rabbit Holds in Store: For You by Neil Somerville

Browse Inside Your Chinese Horoscope 2011: What The Year of the Rabbit Holds in Store: For You by Neil Somerville

"కరివేపాకు పొడి"లో ఐరన్ పుష్కళం...!

"కరివేపాకు పొడి"లో ఐరన్ పుష్కళం...!
Curry Leaves

కావలసిన పదార్థాలు :
కరివేపాకు... ఒక కప్పు
ఎండుమిర్చి... నాలుగు
జీలకర్ర... ఒక టీ.
ధనియాలు... రెండు టీ.
చింతపండు... సరిపడా
మినప్పప్పు... రెండు టీ.
శనగపప్పు... రెండు టీ.
వేరుశనగలు... నాలుగు టీ.
తురిమిన పచ్చి కొబ్బరి... 1/4 కప్పు
వెల్లుల్లి... ఐదు రెబ్బలు
నెయ్యి... రెండు టీ.
నూనె... ఒక టీ.
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి.

బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడికి కొబ్బరి పొడి కూడా కలిపి తడి ఆరిపోయి, పొడి పొడిగా అయ్యేదాకా వేయించి దింపేయాలి. అంతే కరివేపాకు పొడి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ శక్తిని కలిగివున్న కరివేపాకుతో తయారు చేసిన పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
వెబ్ దునియా వంటలు


యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"

యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"
Grapes
FILE
కావలసిన పదార్థాలు :
పుల్లటి ద్రాక్ష కాయలు.. ఒక కేజీ
ఆవాలపొడి.. 2 టీ.
కారం.. 4 టీ.
ఉప్పు.. 2 టీ.
జీలకర్ర పొడి.. 2 టీ.
వెల్లుల్లి రేకలు.. ఒక పాయ మొత్తం
నూనె.. తగినంత

తయారీ విధానం :
ద్రాక్ష కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత నిలువుగా రెండు ముక్కలుగా ద్రాక్షకాయలను కోసుకోవాలి. ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతోపాటు సరిపడా నూనె పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో వేసి మూతపెట్టి ఉంచాలి. మూడు రోజులు బాగా ఊరిన తరువాత, ఈ మిశ్రమంలో ఊట వచ్చి పుల్లగా ఉండే ద్రాక్ష ఆవకాయ తయారవుతుంది.

దీనిని కావల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పాత్రలోకి తీసుకుని అలాగే అయినా లేదా పోపు పెట్టుకుని అయినా అన్నం, ఇడ్లీ, చపాతీ లాంటి వాటిలో నంజుకుని తినవచ్చు. అంతే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పుల్లటి ద్రాక్ష ఆవకాయ తయార్..! శరీరాన్ని తాజాగా ఉంచి ఎల్లప్పుడూ యవ్వనవంతులుగా ఉంచే శక్తి ద్రాక్షలో మెండుగా ఉన్నాయి. అలాగే మతిమరపును దూరం చేయటమేగాక, కాలేయాన్ని కూడా ద్రాక్ష సంరక్షిస్తుంది. కాబట్టి ఈ వెరైటీ ఆవకాయను మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!
వెబ్ దునియా వంటలు


Sunday, November 28, 2010

పుల్ల మామిడితో "రవ్వ పులిహోర"

పుల్ల మామిడితో "రవ్వ పులిహోర"
Pulihora
FILE
కావలసిన పదార్థాలు :
పుల్లటి మామిడికాయ తురుము.. రెండు కప్పులు
బియ్యం రవ్వ.. నాలుగు కప్పులు
ఆవాలు.. రెండు టీ.
శెనగపప్పు, మినప్పప్పు.. రెండు టీ. చొప్పున
వేరుశెనగ పప్పు.. నాలుగు టీ.
జీడిపప్పులు.. 20
పచ్చిమిర్చి.. ఎనిమిది
ఎండుమిర్చి.. నాలుగు
ఇంగువ, పసుపు.. అర టీ.
కరివేపాకు.. నాలుగు రెబ్బలు
నూనె, ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. ఆపై దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను కలపాలి.

ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా చేర్చి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనుంచిన బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి. అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర తయార్..!! దీన్ని అలాగే వేడి వేడిగా తింటే అద్భుతంగా, వెరైటీగా ఉంటుంది.



పుదీనా రైస్

పుదీనా రైస్
కావలసిన పదార్థాలు:

పుదీనా - 2 కట్టలు, బాస్మతి బియ్యం - 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము - పావుకప్పు, పచ్చిమిర్చి - 3, ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌, లవంగాలు - 4, యాలకులు - 4, దాల్చిన చెక్క - 4, పలావు ఆకులు - 4, అనాసపువ్వు - ఒకటి, వేయించిన జీడిపప్పు - పావుకప్పు, నెయ్యి - 2 టీస్పూన్లు, ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా కడగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా.. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ మీద ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి అది మరిగాక మసాలా దినుసులు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక గ్రైండ్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్టును వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి.

ఈ విశ్రమం ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారిన తర్వాత నానబెట్టకున్న బియ్యం, నీళ్లతో సహా వేసి గరిటెతో బాగా కలపి ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్ ఉపయోగించినట్లయితే మూతపై బరువు పెట్టాల్సిన అవసరం లేదు. అదే మందపాటి పాత్రను ఉపయోగించినట్లయితే దాని మూత ఉంచుకోవాలి.

అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి. దీనికి సైడ్ డిష్‌గా గ్రేవీగా చేసుకున్న ఏదైనా మసాల కర్రీని కానీ.. లేదా పెరుగు చట్నీని కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు.




పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!

పోషకాహార లోపమా..? "మటన్ సూప్‌" తాగండి..!!
soup
FILE
కావలసిన పదార్థాలు :
పొట్టేలు లెగ్ పీసెస్.. నాలుగు
ఎసరు నీరు.. ఒకటిన్నర లీ.
వెన్న.. 50 గ్రా.
కార్న్‌ఫ్లోర్.. 25 గ్రా.
కొబ్బరిపాలు.. 2 కప్పులు
గసాల పాలు.. ఒక కప్పు
కొత్తిమీర తురుము.. అర కప్పు
జీడిపప్పు పేస్టు.. 25 గ్రా.
పుదీనా తురుము.. ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
ఉల్లిముద్ద.. ఒక టీ.
కారం.. అర టీ.
పచ్చిమిర్చి ముద్ద.. ఒక టీ.
గరంమసాలా పొడి.. అర టీ.
కుంకుమపువ్వు.. చిటికెడు
ఉప్పు.. తగినంత
నిమ్మరసం.. 2 టీ.

తయారీ విధానం :
లెగ్‌ పీసెస్‌ను కుక్కర్‌లో వేసి ఉల్లిముద్ద, అల్లంముద్ద, పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, కారం, ఉప్పు, మసాలా పొడి, సగం కొత్తిమీర, పుదీనా తురుము వేసి ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి 10 విజిల్స్‌ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించి ముక్కలు తీసేసి నీళ్లను విడిగా వడకట్టి ఉంచాలి. కార్న్‌ఫ్లోర్‌, జీడిపప్పు ముద్ద, గసాల పాలు, కొబ్బరిపాలు, కుంకుమపువ్వు అన్నీ కలిపి ఉంచాలి.

ఓ పాత్రలో మటన్‌ స్టాక్‌ (వడకట్టిన నీళ్ళు) పోసి మరిగించి, అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం జారుగా పోస్తూ కలపాలి. తరువాత ఉడికించిన కాళ్లు, సరిపడా ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించి, వెన్న వేసి దించాలి. చివరగా నిమ్మరసం కలిపి సూప్‌ను చిన్నచిన్న బౌల్స్‌లోకి సర్ది.. ఒక్కో బౌల్‌లో, ఒక్కో మటన్‌ పీస్‌ను కూడా ఉంచి కొత్తిమీర చల్లితే నోరూరించే మటన్‌ సూప్‌ రెడీ..! పోషకాహార లోపంతో బాధపడేవారికి ఇది ఎంతో బలాన్నిస్తుంది.

Health Issues | Homeo medicines | Urine problems | పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి

పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి

Saturday, November 27, 2010

కుచ్‌ కట్టా మీటా నోరూరించే ఛాట్‌లు

కుచ్‌ కట్టా మీటా నోరూరించే ఛాట్‌లు
నోరూరించే ఛాట్‌ను ఇష్టపడని వారుండరు. గప్‌చుప్‌, కట్లెట్‌ వంటి వివిధ రకాల రుచికరమైన ఛాట్‌ ఐటమ్స్‌ను పిల్లలతో పాటు పెద్దవారు ఎంతో ఇష్టంగా తింటారు. ఆదివారాలు, ఇతర సెలవుదినాల్లో కుటుంబ సమేతంగా బయటకు వెళ్లే వారు సినిమాలు, షికార్లు చేస్తూ ఛాట్‌ రుచులను ఆస్వాదిస్తుంటారు.వీటిలో ముఖ్యంగా గప్‌చుప్‌లను ఎక్కువగా తింటారు.

ettinfmanహైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఛాట్‌ వెరెైటీలను అందించే పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ప్రత్యేకంగా వెలిశాయి. ఇవి ఉదయం నుంచి రాత్రి వరకు ఎల్లప్పుడు రద్దీతో కిటకిటలాడుతుంటాయి. హైదరాబాద్‌ నగరంలో తెలుగువారితో పాటు ఉత్తరాదీ వారు అధికంగా నివసిస్తున్నారు. గుజరాత్‌, రాజస్తాన్‌, మహరాష్ట్ర, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసిస్తున్న హైదరాబాద్‌ను మినీ ఇండియాగా పేర్కొంటారు. ఇక ఉత్తరాది వారి ఆహారపు అలవాట్లలో భాగంగా కనిపించే ఛాట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ ఎన్నో ప్రత్యేక రుచులలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

నోరూరించే రుచులతో...
chatహైదరాబాద్‌ నగరంలో ప్రతి రహదారిలో కనిపిస్తాయి వివిధ రకాల ఛాట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌. వీటిలో గప్‌చుప్‌, కట్లెట్‌, పావ్‌బాజీ, దహీపురీ, కచోరీ, సమోసా, దహీవడ, చుడువా వంటి ఎన్నో రకాల ఛాట్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకి ముఖ్యమైనది గప్‌చుప్‌. దీనినే పానీపూరీ లేదా గోల్‌ గప్పా అని కూడా అంటారు. ఇక పానీపూరీలను బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌లలో పూచ్‌కా అని కూడా పిలుస్తారు.గప్‌చుప్‌లు నేడు మన దేశంలోనే కాదు కొన్ని విదేశాల్లో సైతం ప్రఖ్యాతి గాంచాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో గప్‌చుప్‌లు లభిస్తాయనడం శోచనీయం కాదు. సై్పసీగా ఉండే నీటితో నింపి ఇచ్చే గప్‌చుప్‌లను పిల్లలతో పాటు పెద్దవారు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఉన్న పబ్బులు ప్రత్యేకంగా వోడ్కా గప్‌చుప్‌లను కూడా అందిస్తున్నాయి. పూర్తిగా వోడ్కాతో నింపి ఇచ్చే ఈ గప్‌చుప్‌లను యువతులు ఇష్టపడి తింటున్నారట.

ఉత్తరప్రదేశ్‌ నుంచి...
గప్‌చుప్‌ల తయారీ మొదట ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. అనంతరం ఈ పానీపూరీలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రధాన నగరాల్లోని స్కూల్‌, కాలేజీలకు వెళ్లే పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఇష్టంగా వీటిని తింటున్నారు. హైదరాబాద్‌లో గప్‌చుప్‌ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రజల ఇష్టం మేరకు నేడు ఎన్నో రకాల గప్‌చుప్‌లు లభ్యమవుతున్నాయి. వీటిలో స్వీట్‌, కట్టా,మీటా తదితర రకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. గప్‌చుప్‌లో నింపే సై్పసీగా ఉండే నీటిని చింతపండు, ఆలుగడ్డ, బఠాని, ఉల్లిపాయలు, ఛాట్‌మసాలను మంచినీటిలో కలిపి తయారుచేస్తున్నారు.

స్వీట్‌ గప్‌చుప్‌ల కోసం మంచినీటిలో కొంచెం బెల్లం, చక్కెరను కూడా కలుపుతున్నట్టు అబిడ్స్‌లోని ఓ ఛాట్‌ సెంటర్‌ నిర్వాహకుడు జగదీష్‌ తెలిపారు. ప్రజల అభిరుచుల మేరకు గప్‌చుప్‌లను వివిధ రకాలుగా తయారుచేస్తున్నామన్నారు. స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు పెద్దవాళ్లు సైతం ఎంతో ఇష్టంగా గప్‌చుప్‌లను తింటున్నారని చెప్పారు. పానీపూరీలను ఒక్కసారిగా నోట్లో వేసుకొని తింటే ఆ టేస్టే అమోఘం అని అన్నారు గప్‌చుప్‌ ప్రియుడు సుధాకర్‌. కనీసం వారానికి రెండు రోజుల పాటైనా గప్‌చుప్‌లను తాను తింటానని ఆయన చెప్పారు.

ఎన్నో వెరెైటీలు...
Sharmaf-Chudwaఛాట్‌లలో నేడు ఎన్నో వెరెైటీలు లభ్యమవుతున్నాయి. వీటిలో కట్లెట్‌, దహీపురీ, సేవ్‌పురీ, పావ్‌బాజీ, దహీవడ తదితరాలను భోజనప్రియులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. స్వీట్‌ లేదా హాట్‌గా ఈ ఛాట్‌లు లభిస్తున్నాయి. నేడు ఛాట్‌ సెంటర్ల వ్యాపారం హైదరాబాద్‌ నగరంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.

పావ్‌ బ్రెడ్‌తో లభించే పావ్‌బాజీ కొందరు స్కూల్‌, కాలేజీ స్టూటెండ్‌లకు ఇష్టమైన సై్ససీ ఫుడ్‌గా ఉంటోందని హిమాయత్‌నగర్‌లోని ఓ ఛాట్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఘన్‌శ్యామ్‌ తెలిపారు. తమ వద్ద ఇతర ఛాట్‌ ఐటమ్స్‌ కంటే పావ్‌బాజీ ఎక్కువగా అమ్ముడవుతుందని తెలిపారు. ఇక ప్రజలు అమితంగా ఇష్టపడి తినే ఛాట్‌లను ప్రత్యేకంగా వివాహాది శుభకారాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నారు. అన్ని రకాల రుచికరమైన భోజన పదార్థాలతో పాటు గప్‌చుప్‌, కట్లెట్‌ వంటి ఛాట్‌లను శుభకార్యాలకు వచ్చే వారు ఇష్టంగా ఆరగిస్తున్నారు.


దేశ,విదేశాల్లో ప్రఖ్యాతిగాంచి...
Sharma-Chudwa1సుల్తాన్‌బజార్‌ రాయల్‌ దిల్షాద్‌ ప్లాజా ఎదురుగా ఫుట్‌పాత్‌పెై ఎల్లప్పుడు రద్దీగా కనిపిస్తుంది ఓ చుడువా బండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కిటకిటలాడే ఈ చుడువా బండి గత 40 సంవత్సరాలుగా చుడువా ప్రియులకు సుపరిచతమే. ఇదే రమేష్‌చంద్‌ శర్మ ‘హరి ఓం చుడువా’ బండి.1968లో రమేష్‌చంద్‌ శర్మ దీన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ తోపుడు బండిలో లభించే చుడువా అందరినీ మైమరపిస్తోంది. ప్రస్తుతం రమేష్‌చంద్‌ తనయులు ముఖేష్‌ శర్మ, విశాల్‌శర్మ, గన్నూలు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చుడువాను ప్రత్యేకంగా ప్యాకింగ్‌లలో సైతం వారు విక్రయిస్తుంటారు.

‘తమ తండ్రి తయారుచేసిన సై్పసీగా ఉండే చుడువాను నాటి నుంచి నేటి వరకు రుచిలో ఎటువంటి మార్పు లేకుండా రూపొందిస్తున్నాము. ప్రజల టేస్ట్‌ మేరకు ప్రస్తుతం బాదం పిస్తా, డ్రైఫ్రూట్స్‌, స్వీట్‌, కట్టామీటా తదితర రకాల చుడువాలను తయారుచేస్తున్నాము’ అని ముఖేష్‌ శర్మ పేర్కొన్నారు. ఇక హరి ఓం చుడువాను హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యేకంగా కొనుగోలుచేస్తుంటారు. తమ స్వస్థలానికి వచ్చి విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా ఈ చుడువాను కొనుక్కొని వెంట తీసుకెళ్తుంటారు. ప్రత్యేకంగా వివాహాది శుభకార్యాలు, పార్టీలు, ఫంక్షన్‌లకు ఈ రుచికరమైన చుడువాను ప్రత్యేకంగా తీసుకుపోతారు.పలు ఛాట్‌ సెంటర్ల నిర్వాహకులు సైతం హరి ఓం చుడువాను తీసుకెళ్లి తమ షాపులలో ఏర్పాటుచేస్తుండడం విశేషం.

-ఎస్‌.అనిల్‌ కుమార్






సర్కారీ స్కూళ్ళు దారుణం

సర్కారీ స్కూళ్ళు దారుణం
Govt-Schoolహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం కోసం అనేక రకాలైన విద్యా పథకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఫలితాలలో మార్పులు ఉండడం లేదు. గత ఆరేళ్ళలో నుంచి 2004 విద్యా సంవత్సరం నుంచి లెక్కించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది.2004-2005 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 66.93 శాతంగా ఉన్న ఎన్‌రోల్‌మెంట్‌, 2009-2010 విద్యా సంవత్సరంలో 56.82 శాతానికి పడి పోయింది. ఈ విషయాలు రాజీవ్‌ విద్యా మిషన్‌ (ఎస్‌ఎస్‌ఎ) చేసిన బడిబాట కార్యక్రమం, ఇతర కార్యక్రమాల ద్వారా స్పష్టమైందని స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అలీ రఫత్‌ పేర్కొన్నారు.

నిర్వీర్యమవుతున్న విద్యా పథకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఉమ్మడి భాగస్వామ్యంతో సర్కారి స్కూళ్ళను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు ఏ మాత్రం పెరగడం లేదు. ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం సర్వ శిక్ష అభియాన్‌, అనే పథకం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ పథకం లక్ష్యం పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో బాటు సర్కారి స్కూళ్ళలో ఎన్‌రోల్‌మెంట్‌ పెంచే కార్యక్రమాలు కూడా చేయాలి. అందుకోసం బోధన పద్దతులపై ఎప్పటికప్పుడు టీచర్లకు శిక్షణలు ఇవ్వడం, క్లిప్‌, క్లాప్‌ కార్యక్రమాలు చేయడం, కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పిల్లలను ఆకర్షించలేక పోతున్నారు.

అందులో భాగంగానే కొన్ని సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దాని వల్ల ఇంటి దగ్గర భోజనం లేని వారికి స్కూల్‌కు వచ్చినట్లయితే ఆ భోజనం స్కూళ్ళలోనే తినే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించాయి. అందుకోసం ఏడాదికి దాదాపు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికి ఎన్‌రోల్‌మెంట్‌ ఏ మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ భారీగా తగ్గింది. డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి పోయింది.

పట్టణాలకు వలసలు, ఇంగ్లీష్‌ స్కూళ్ళు లేక పోవడం
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ సంఖ్య భారీగా తగ్గపోవడానికి రెండు రకాల కారణాలను గుర్తించారు. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కరువై పట్టణాలకు తరలి పోతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వలసలపై వెళ్ళిన వారంతా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు. అలాగే ప్రభుత్వ అధీనంలో ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు లేవు. ఈ రోజులో కూలి పని చేసుకునే కుంటుంబం కూడా తమ పిల్లవానికి ఇంగ్లీష్‌ మీడియంలో చదివించాలన్న ఆలోచనలు పెరిగాయి.

దానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు లేక పోవడం వల్ల వారంతా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.ఇత్యాది కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ శాతం అంతకంతకు పడి పోతున్నదని స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే వారి వివరాలు కూడా గత ఆరేళ్లలో ఈ ఏడాదిలో చాలా తక్కువ సంఖ్య నమోదైంది. గత ఏడాదిలో కొటీ 36 లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ కాగా, 2009-2010 విద్యా సంవత్సరంలో మాత్రం కోటీ 33 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఎన్‌రోల్‌ అయ్యారు. రోజు రోజుకు జనాభా సంఖ్య పెరిగుతున్నప్పటికీ కూడా చదువుకునే వారి సంఖ్య తగ్గి పోవడం గమనించాల్సిన విషయంగా మారింది.
సూర్య తెలుగు పేపర్

Sunday, November 21, 2010

కుమ్మరోళ్లు

కుమ్మరోళ్లు
మట్టికి జీవంపోసిన బ్రహ్మస్వరూపులు
సింధునాగరికతకు నాటువేసిన మహనీయులు
మానవజాతి మనుగడకు ముఖ్య కారకులు
చేతివేళ్లతో మట్టిని మలిచే శాస్ర్తీయజ్ఞాన సంపన్నులు
కుండపెంకులపై అక్షరాలు వ్రాసిన తొలి లేఖకులు
కుండలు, కూజాలు, దేవతాప్రతిమాదుల సృష్టికర్తలు
టెర్రకోట్‌ విగ్రహాల అందాల ఆవిష్కర్తలు
పూర్‌మేన్‌ ఫ్రిజ్‌ను కనిపెట్టిన
ఘటనా ‘ఘట’ సమర్థులు
ఇటుకుల తయారీ మర్మం తెలిసిన కళామూర్తులు
మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకుని
మరో పనిరాక, మ్రగ్గిపోతున్న మట్టిలో మాణిక్యాలు
తయారుచేసే వంటపాత్రలు పెంటపాలయ్యి
కాలుతున్న కడుపుల్తో చస్తూ బ్రతుకుతున్నోళ్లు
గుండెలోని దిగులంతా తమ వాములోనే కాల్చుకుని
తలకొరివిపెట్టే కుండతో పాటే
కాటికి పయనమౌతున్నోళ్లు
మలినత్వంలో
అపరిశుభ్ర వాతావరణంలో
పన్జేస్తూ
కడదాకా బ్రతుకు కడలి
ఈదుతున్న కుమ్మరోళ్లు !
pallinallaniah

Surya Telugu Daily Telugu News Paper

విద్యాకుసుమాలు

విద్యాకుసుమాలు
storyసరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చాడు అర్జున్‌. అదిచూసి ‘‘ఏవండీ త్వరగా వచ్చారు ఏంటి సంగతి’’
చదవండి
Telugu Culture and Tradition, etc

Friday, November 19, 2010

నిర్ణయం

నిర్ణయం
storyసూర్యాస్తమయం కాబోతోంది... చీకటి రాజ్యమేలే సమయం దగ్గరపడు తోంది. పట్టుచీర అమ్మకానికి పట్టుకెళ్ళిన నాన్న ఇంకా ఇంటికి రాలేదు. పొయ్యిలో ని ప్పు వేయటానికి, చేటలో బియ్యం లేక అమ్మ దిగాలుగా కూర్చుంది. ఆర్థిక స్తోమత లేక చదువు మానేసిన చెల్లెలు తేజ చింతిస్తూ... మూలన నిలుచుంది. నాన్న కోసం షావుకారు చిట్టా మురళి దగ్గరకెళ్ళి అడిగాను... ‘‘ఇప్పుడే బాబు! చీరలిచ్చి వెళ్ళాడు. అందులో ఒకటి నాణ్యత సరిగా లేదని వెనక్కి పంపాను. అంతా పోను... మీరే పదిహేను వేలు బాకీ పడ్డారు. చీటి రాసి పంపించాను’’ తేలిగ్గా అనేసాడా షావుకారు... అక్కడ నుంచి వెనక్కి తిరిగాను. ఎక్కడ ఆచూకీ దొరక్కపోయేసరికి నా గుండె వేగం పుంజుకుంది. చదవండి...




Thursday, November 18, 2010

| "గేట్ వే ఆఫ్ ఇండియా" కథా, కమామీషు..!!

"గేట్ వే ఆఫ్ ఇండియా" ముంబయి నగరంలోని అపోలోబందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే.

భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. 1911వ సంవత్సరం డిసెంబర్‌లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్‌లో కట్టడాన్ని పూర్తి చేశారు.
చదవండి ...





సోరకాయ రోటీ....

సోరకాయ రోటీ....
కావలసిన పదార్థాలు...
Sorakaya-Rotiసొరకాయ తురుము - ఒక కప్పు
బియ్యపుపిండి - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము - సగం కప్పు
పచ్చి శెనగపప్పు - 50 గ్రాములు
అల్లం, పచ్చిమిర్చి ముద్ద - ఒక టీస్పూన్‌
ఉల్లి తురుము - సగం కప్పు
జీలకర్ర - సగం టీస్పూన్‌
ఉప్పు - తగినంత
నూనె - రొట్టెలు కాల్చడానికి సరిపడినంత

తయారుచేసే విధానం...


Wednesday, November 17, 2010

కేరట్ కొబ్బరి పాయసం

నీటి ప్రవాహంలో ఒక సవ్వడి

నవ్వులు, మువ్వలు కలిసినట్టు
నీళ్ళకు వెలుతురుకు చెలిమి
ప్రవాహం చరిత్రను
మోసుకెళుతూనే వుంటుంది
నదీ నాగరికతలన్నీ
వికసించిన ప్రజ్వలనాలే కదా!
చదవండి...




Tuesday, November 16, 2010

మీ చెవి గుర్తింపునకు ఆధారం!

మీ చెవి గుర్తింపునకు ఆధారం!

ఆరు పాయింట్ ఏడు బిలియన్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉండాలంటే వేలిముద్రల కన్నా, చెవి ఆకారం మంచి మార్గమని పరిశోధకులు అంటున్నారు. బయోమెట్రిక్స్ గురించి ఇటీవల జరిగిన నాలుగవ అంతర్జాతీయ సదస్సులో ఈ విషయం వెల్లడైంది.
more...


అద్దాల గదుల్లో అందాల మొక్కలు

terrarium | అద్దాల గదుల్లో అందాల మొక్కలు | Andhra Bhoomi

Sunday, November 14, 2010

హరివిల్లు

హరివిల్లు

తిట్ల భూతం-చందమామ కథలు

Chandamama:Indian children's magazine with stories on mythology, culture & tradition.

Chandamama:Indian children's magazine with stories on mythology, culture & tradition.

Chandamama:Indian children's magazine with stories on mythology, culture & tradition.

Visalaandhra Daily Telugu News Paper -వ్యక్తిత్వానికి ఫౌండేషన్‌ అవసరం

Visalaandhra Daily Telugu News Paper -వ్యక్తిత్వానికి ఫౌండేషన్‌ అవసరం

Visalaandhra Daily Telugu News Paper -ఆకుకూరలతో అందం

Visalaandhra Daily Telugu News Paper -ఆకుకూరలతో అందం

Visalaandhra Daily Telugu News Paper -శీతాకాలం స్వీయరక్షణ

Visalaandhra Daily Telugu News Paper -శీతాకాలం స్వీయరక్షణ

Visalaandhra Daily Telugu News Paper -మంచి పాఠశాలలో చేర్చినంత మాత్రాన బాధ్యత తీరిపోతుందా?

Visalaandhra Daily Telugu News Paper -మంచి పాఠశాలలో చేర్చినంత మాత్రాన బాధ్యత తీరిపోతుందా?

వ్యాధులు-నివారణోపాయాలు -సూర్యలోవరాజు

వ్యాధులు-నివారణోపాయాలు -సూర్యలోవరాజు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

పసుపే ఆరోగ్యానికి పసిడి

పసుపే ఆరోగ్యానికి పసిడి

పసుపుతో ఆరోగ్యం

పసుపుతో ఆరోగ్యం

చిన్ని చిట్కాలతో చింతలు దూరం

చిన్ని చిట్కాలతో చింతలు దూరం

పళ్లతో ఆరోగ్యం పదింతలు

పళ్లతో ఆరోగ్యం పదింతలు

చిన్ని చిట్కాలు - ఆరోగ్యసూత్రాలు

చిన్ని చిట్కాలు - ఆరోగ్యసూత్రాలు

పళ్లతో పండంటి ఆరోగ్యం

పళ్లతో పండంటి ఆరోగ్యం

చర్మం మెరవాలంటే...

చర్మం మెరవాలంటే...

అందుబాటులో ఆయుర్వేదం

అందుబాటులో ఆయుర్వేదం

మజ్జిగ

మజ్జిగ

బార్లీ

బార్లీ

కొత్తిమీర

కొత్తిమీర

ధనియాలు

ధనియాలు

పుదీన

పుదీన

నువ్వులు

నువ్వులు

తమలపాకు

తమలపాకు

తులసి

తులసి

ఇంగువ

ఇంగువ

అల్లం

అల్లం

ఉసిరి

ఉసిరి

ఎగ్ పరోటా

ఎగ్ పరోటా

గార్లిక్ జింజర్ చికెన్

గార్లిక్ జింజర్ చికెన్

రాగిదోసె

రాగిదోసె

ప్రాన్స్ బుల్లెట్స్

ప్రాన్స్ బుల్లెట్స్

మెంతి చారు

మెంతి చారు

బొప్పాయి కర్రీ

బొప్పాయి కర్రీ

ఆయుర్వేద లస్సీలు

ఆయుర్వేద లస్సీలు

ముల్లంగి పెరుగు వడ

ముల్లంగి పెరుగు వడ

పనస వడ

పనస వడ

మునగాకు కూర

మునగాకు కూర

కెలిడో స్కోప్

కెలిడో స్కోప్

విత్తన ఇంక్యుబేటర్

విత్తన ఇంక్యుబేటర్

చేసి చూద్దాం

చేసి చూద్దాం

బొమ్మకు నకలు

బొమ్మకు నకలు

ఇంట్లో వర్ణపటం

ఇంట్లో వర్ణపటం

విడదీయలేని గ్లాసులు

విడదీయలేని గ్లాసులు

తేలే గుండుసూది

తేలే గుండుసూది

dead sea | పురుగులను తింటే పోలే? | Andhra Bhoomi

dead sea | పురుగులను తింటే పోలే? | Andhra Bhoomi

light | వజ్రం అంటే ఏమిటి? | Andhra Bhoomi

light | వజ్రం అంటే ఏమిటి? | Andhra Bhoomi

resign | రాజా రాజీనామా | Andhra Bhoomi

resign | రాజా రాజీనామా | Andhra Bhoomi

suki freed | సూకీకి స్వేచ్ఛ | Andhra Bhoomi

suki freed | సూకీకి స్వేచ్ఛ | Andhra Bhoomi