Total Pageviews

Sunday, November 21, 2010

కుమ్మరోళ్లు

కుమ్మరోళ్లు
మట్టికి జీవంపోసిన బ్రహ్మస్వరూపులు
సింధునాగరికతకు నాటువేసిన మహనీయులు
మానవజాతి మనుగడకు ముఖ్య కారకులు
చేతివేళ్లతో మట్టిని మలిచే శాస్ర్తీయజ్ఞాన సంపన్నులు
కుండపెంకులపై అక్షరాలు వ్రాసిన తొలి లేఖకులు
కుండలు, కూజాలు, దేవతాప్రతిమాదుల సృష్టికర్తలు
టెర్రకోట్‌ విగ్రహాల అందాల ఆవిష్కర్తలు
పూర్‌మేన్‌ ఫ్రిజ్‌ను కనిపెట్టిన
ఘటనా ‘ఘట’ సమర్థులు
ఇటుకుల తయారీ మర్మం తెలిసిన కళామూర్తులు
మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకుని
మరో పనిరాక, మ్రగ్గిపోతున్న మట్టిలో మాణిక్యాలు
తయారుచేసే వంటపాత్రలు పెంటపాలయ్యి
కాలుతున్న కడుపుల్తో చస్తూ బ్రతుకుతున్నోళ్లు
గుండెలోని దిగులంతా తమ వాములోనే కాల్చుకుని
తలకొరివిపెట్టే కుండతో పాటే
కాటికి పయనమౌతున్నోళ్లు
మలినత్వంలో
అపరిశుభ్ర వాతావరణంలో
పన్జేస్తూ
కడదాకా బ్రతుకు కడలి
ఈదుతున్న కుమ్మరోళ్లు !
pallinallaniah

Surya Telugu Daily Telugu News Paper

No comments:

Post a Comment