Total Pageviews

Monday, November 29, 2010

యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"

యవ్వనాన్ని కాపాడే "ద్రాక్ష ఆవకాయ"
Grapes
FILE
కావలసిన పదార్థాలు :
పుల్లటి ద్రాక్ష కాయలు.. ఒక కేజీ
ఆవాలపొడి.. 2 టీ.
కారం.. 4 టీ.
ఉప్పు.. 2 టీ.
జీలకర్ర పొడి.. 2 టీ.
వెల్లుల్లి రేకలు.. ఒక పాయ మొత్తం
నూనె.. తగినంత

తయారీ విధానం :
ద్రాక్ష కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత నిలువుగా రెండు ముక్కలుగా ద్రాక్షకాయలను కోసుకోవాలి. ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతోపాటు సరిపడా నూనె పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో వేసి మూతపెట్టి ఉంచాలి. మూడు రోజులు బాగా ఊరిన తరువాత, ఈ మిశ్రమంలో ఊట వచ్చి పుల్లగా ఉండే ద్రాక్ష ఆవకాయ తయారవుతుంది.

దీనిని కావల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పాత్రలోకి తీసుకుని అలాగే అయినా లేదా పోపు పెట్టుకుని అయినా అన్నం, ఇడ్లీ, చపాతీ లాంటి వాటిలో నంజుకుని తినవచ్చు. అంతే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పుల్లటి ద్రాక్ష ఆవకాయ తయార్..! శరీరాన్ని తాజాగా ఉంచి ఎల్లప్పుడూ యవ్వనవంతులుగా ఉంచే శక్తి ద్రాక్షలో మెండుగా ఉన్నాయి. అలాగే మతిమరపును దూరం చేయటమేగాక, కాలేయాన్ని కూడా ద్రాక్ష సంరక్షిస్తుంది. కాబట్టి ఈ వెరైటీ ఆవకాయను మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!
వెబ్ దునియా వంటలు


No comments:

Post a Comment